హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరుస మరణాలపై ప్రత్యేక బృందం విచారణ

నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వరుసగా పిల్లల మరణాతలో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ మరణాలపై ప్రభుత్వం స్పందించింది. HYD నిలోఫర్ ఆసుపత్రి చిన్నపిల్లల నిపుణులు డా. బాబురావు, డా. కవితల ప్రత్యేక బృందం ఇక్కడ విచారణ చేపట్టింది. స్థానిక సూపరింటెండెంట్ సంపత్ కుమార్ సమక్షంలో వైద్య సేవలు, మృతికి దారితీసిన పరిస్థితులను పరిశీలించారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.