MBNR: జడ్చర్లలో బీజేపీ కార్యాలయాలపై కాంగ్రెస్ నాయకుల దాడులను ఖండిస్తూ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పట్టణ అధ్యక్షుడు ఎడ్ల అమర్నాథ్ గౌడ్ తెలిపారు. ఆగస్టు 2న ఉదయం 10 గంటలకు అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
బీజేపీ ఆధ్వర్యంలో నిరసనకు పిలుపు


