VSP: కొమ్మాది జంక్షన్‌లోని త్రిశక్తి దేవాలయంలో శ్రీ బంగారమ్మ, ఎర్నమ్మ, దండుమారమ్మ అమ్మవార్ల వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చన, పుష్పార్చన, హారతులు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణతో పాటు ఘనంగా అన్నసంతర్పణ చేపట్టారు. సుమారు 2 వేల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా త్రిశక్తి అమ్మవార్ల వార్షికోత్సవం


