హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నాయకుడిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

పార్వతీపురం మండలం డోకుశీల పంచాయతీ తేలునాయుడువలస గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు బొమ్మీ కోటి నాయుడును మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మంగళవారం పరామర్శించారు. ఇటీవల గుండెకు శస్త్రచికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న కోటి నాయుడి ఆరోగ్య పరిస్థితిని జోగారావు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు.