E.G: కూటమి ధర్మాన్ని పాటిస్తూనే క్షేత్రస్థాయిలో జనసేనను బలోపేతం చేయడమే లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 2న నిడదవోలులో ప్రత్యేక పూజలు, భారీ బైక్ ర్యాలీ, రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. జనసైనికులు, వీరమహిళలు భారీగా తరలివచ్చి కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు మంత్రి పిలుపు


