హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుక డంపుల సీజ్

JGL: కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామ శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులపై రెవెన్యూ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఆర్ఐ రాజేందర్‌రావు ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో 30కి పైగా ఇసుక కుప్పలను గుర్తించి సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఇసుకను బహిరంగ వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలించినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.