హైదరాబాద్: 28°C
తెలంగాణ

రౌడీషీటర్లపై అత్తాపూర్‌ పోలీసుల నజర్

RR: గణేశ్‌ నవరాత్రుల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్తాపూర్‌ పోలీసులు ‘నజర్‌ ఆన్‌ రౌడీషీటర్స్‌’ పేరుతో ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని 72 మంది రౌడీషీటర్లలో 45 మంది హాజరయ్యారు. పండుగ వేళ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఇన్‌స్పెక్టర్‌ ఎ.సీతయ్య హెచ్చరించారు.