హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ముగిసిన కామ్రేడ్ రాధాక్క అంతిమయాత్ర

ADB: ఆదిలాబాద్‌లోని లింగుగూడలో మావోయిస్టు నేత కుర్సంగె మోతిబాయి (రాధాక్క) అంతిమయాత్ర మంగళవారం నిర్వహించారు. రిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందిన ఆమె భౌతికకాయానికి సహచరుడు ప్రసాద్‌రావు, దేవుజీ, ప్రజా సంఘాలు, రాజకీయ, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజలు ఘన నివాళులర్పించారు. 3 దశాబ్దాలుగా ప్రజానీకానికి సేవ చేసిన రాధాక్క ఆశయాలను కొనసాగిస్తామని వక్తలు నినాదాలు చేశారు.