NLR: ఆత్మకూరు పట్టణంలోకి వచ్చే బైపాస్ రోడ్డులో రూ. 9 కోట్ల వ్యయంతో చేపడుతున్న నూతన రోడ్డు నిర్మాణ పనులను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పరిశీలించారు. అధికారులతో పాటు నియోజకవర్గ నేతలతో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు. నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా లోపాలు లేకుండా నిబంధనల మేరకు పనులు చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన మంత్రి


