NGKL: జిల్లాలోని పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న కల్వకుర్తి మండలం రంగాపూర్‌కు చెందిన ఆలె సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మూడేళ్లుగా ఛత్తీస్‌గఢ్ నుంచి గంజాయి కొనుగోలు చేసి చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి యువతకు విక్రయిస్తున్నట్లు కల్వకుర్తి SI కురుమూర్తి తెలిపారు. గంజాయి కొనుగోలు, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
తెలంగాణ
గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్: SI


