హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి: ఎమ్మెల్యే

SRD: ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామాలు అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. కల్హేర్ మండలం పరిషత్ కార్యాలయంలో మంగళవారం ప్రభుత్వ వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు. గ్రామాల సమస్యల పరిష్కారం రైతాంగ సంక్షేమం రహదారుల మరమ్మతులు విద్య వైద్య సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.