హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడా ఎంపికలు

GDWL: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీల జిల్లా స్థాయి ఎంపికలు ఈ నెల 3న ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి రామలింగేశ్వర గౌడ్ తెలిపారు. ఆసక్తి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు గురువారం ఉదయం 10:30 గంటలకు ఐడీ, ఆధార్ కార్డులతో హాజరై పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు క్రీడల శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.