హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మడకశిరలో రూ.7 కోట్లకు పైగా అభివృద్ధి పనులు

సత్యసాయి: మడకశిర నియోజకవర్గం ఆగళి మండలంలో రూ. 7 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామితో కలిసి హళ్లికేర, ముత్తేపల్లి, అలుడి, కొమరేపల్లి, మధుడి, రామనపల్లి గ్రామాలతో పాటు ఆగళి మండల కేంద్రంలో పనులకు శ్రీకారం చుట్టారు. సీసీ రోడ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తదితర పనులు ఇందులో ఉన్నాయి.