హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్రపు చెరువుకు త్రాగునీటి విడుదల

కృష్ణా: అవనిగడ్డలోని గుర్రపు చెరువుకు త్రాగునీటిని విడుదల చేశారు. ముందుగా చెరువును వెల్లవేసి బ్లీచింగుతో శుభ్రం చేయించారు. మంగళవారం చెరువును నీటితో నింపే కార్యక్రమం ప్రారంభించారు. ఈ పనులను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, తహసీల్దార్ బీ.అంకాలు, ఆర్ఐ బాలాజీ, పంచాయతీ ఈఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.