హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేషన్ డిపో ఏర్పాటు చేయాలి'

ASR: డుంబ్రిగూడ మండలం కూడ రెవెన్యూ గ్రామంలో రేషన్ డిపో ఏర్పాటు చేయాలని సీపీఎం మాజీ సర్పంచ్ పాంగి సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. కూడ పరిధిలోని జోడిగూడ, గరిడేలు, కుసుమకెంద, కంగారుసొల గ్రామాలకు చెందిన సుమారు 130 మంది రేషన్ కార్డుదారులు 25 కిలోమీటర్ల దూరంలోని లోగిలి రేషన్ డిపోకు వెళ్లాల్సి వస్తోందన్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.