MDK: తూప్రాన్ పరిసర ప్రాంతాల విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక బస్సులు నడపాలని బలగం మిత్ర బృందం సభ్యులు కోరారు. కొంపల్లి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ మేరకు మేడ్చల్ ఆర్టీసీ డీఎం ప్రమీల, సీఐ రామారావుకు వినతిపత్రం అందజేసి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలి'


