హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోపవరం PACS ఛైర్మన్‌గా వడ్డే నారాయణరావు

KMM: కొణిజర్ల (మం) గోపవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఛైర్మన్‌గా వడ్డే నారాయణరావు నియమితులయ్యారు. ఆయనతో పాటు మరో పది మంది పాలకవర్గ సభ్యులను నియమిస్తూ.. మంగళవారం వైరా MLA మలోత్ రాందాస్ నాయక్ నియామక పత్రాలు అందజేశారు. నూతనంగా నియమితులైన అధ్యక్షుడు, పాలకవర్గ సభ్యులు సహకార సంఘం అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి కృషి చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.