VSP: ఏయూ వైద్యశాలలో మంగళవారం గీతం దంత వైద్యశాల ఆధ్వర్యంలో విద్యార్థులు, పరిశోధకులు, బోధన, బోధనేతర సిబ్బంది కోసం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన ఏయూ రెక్టార్ ఆచార్య పులిపాటి కింగ్ మాట్లాడుతూ.. దంత ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సిబ్బంది, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరాలను తరచూ నిర్వహించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏయూలో ఉచిత దంత వైద్య శిబిరం


