హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు'

విజయనగరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని సీఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి మంగళవారం తెలిపారు. దొంగతనాలు, ఇళ్లలో చోరీలు, ద్విచక్ర వాహనాల అపహరణ దుకాణాల్లో చోరిలు వాటిపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని చెప్పారు. అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే 9121109419 నంబర్‌కు సమాచారం అందించాలని ఆయన కోరారు.