హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరంగల్‌లో యూరియా నిల్వలు జీరో

WGL: జిల్లాలో యూరియా నిల్వలు ఆన్‌లైన్‌లో జీరోగా చూపడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,53,621 బస్తాలు అందుబాటులో ఉన్నప్పటికీ వరంగల్ జిల్లాలో నిల్వలు లేకపోవడం ఆవేదన కలిగిస్తోంది. ఖరీఫ్ పంటలకు ఎరువు అవసరమైన సమయంలో సరఫరా నిలిచిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే యూరియా సరఫరా చేయాలని రైతులు కోరారు.