హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆర్‌సెటి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి'

KMR: నస్రుల్లాబాద్‌లోని కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్‌సెటి), KMR ఆధ్వర్యంలో జిల్లా యువతకు నిర్వహించిన సీసీటీవీ కెమెరా సర్వీసింగ్ శిక్షణ మొదటి బ్యాచ్ ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఆర్‌డీఏ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి హాజరై శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ధ్రువపత్రాలను అందజేశారు.