హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతుల బాగుకే 'గట్టు మీద చెట్టు' కార్యక్రమం

PPM: పంట పొలాల గట్లపై చెట్లను పెంపొందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. వీరఘట్టం మండలం కంబర గ్రామంలో మంగళవారం నిర్వహించిన 'గట్టు మీద చెట్టు' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా మొక్కలు నాటి, రైతులతో ముఖాముఖి మాట్లాడారు.