హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 8న సీజ్ చేసిన ఇసుక వేలం

MDK: మాసాయిపేట మండలం హకీంపేట వద్ద సీజ్ చేసిన 80 టన్నుల ఇసుకకు ఈనెల 8న ఉదయం 11 గంటలకు వేలం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ జ్ఞానజ్యోతి తెలిపారు. ఇసుకను హకీంపేట హైస్కూల్ ప్రాంగణంలో నిల్వ ఉంచినట్లు పేర్కొన్నారు. వేలంలో పాల్గొనేవారు ఈనెల 7న సాయంత్రం 4 గంటల్లోగా రూ.5 వేల డీడీని ముందస్తుగా చెల్లించాలని సూచించారు.