హైదరాబాద్: 28°C
తెలంగాణ

నోటీసుల విచారణ వేగవంతం చేయాలి: కలెక్టర్

MD: ఎస్ఐఆర్ నోటీసుల విచారణను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. పిల్లికొట్టాల్లోని 12వ వార్డులో విచారణను పరిశీలించారు. 124 నోటీసులకు గానూ 91 విచారణ పూర్తయిందన్నారు. ఆధారాలను యాప్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.