హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: శిరీష హత్యపై పీఓడబ్ల్యూ నిరసన

BDK: అశ్వాపురం సెంటర్‌లో నర్సు శిరీషపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనను ఖండిస్తూ.. ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షురాలు పెద్దగ్రోని ఆదిలక్ష్మి మాట్లాడుతూ.. మహిళలకు పని ప్రదేశాల్లో, బయట పూర్తి రక్షణ కల్పించాలని కోరారు. శిరీషను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ నాయకులు పాల్గొన్నారు.