హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మహిళపై పోలీసుల తీరు విచారకరం'

PPM: మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణిపై పోలీసులు వ్యవహరించిన తీరు విచారించదగ్గ విషయమని వైసీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ రంగుముద్రి శివ నరేంద్ర నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం బలిజిపేటలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసుల వ్యవహారశైలిని మార్చుకోవాలని, ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించాలని ఆయన కోరారు.