హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌ 1000 రోజుల వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ పోరాటం

KNR: కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో వైఫల్యాలు, ప్రజా కష్టాలపై పోరాడాలని BRS నిర్ణయించింది. కరీంనగర్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన ముఖ్యనేతల భేటీలో ఈ మేరకు తీర్మానించారు. కేటీఆర్ పిలుపుతో సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు నియోజకవర్గంలో భారీ నిరసనలు చేపట్టనున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని గంగుల తెలిపారు.