MDK: క్షేత్రస్థాయిలో పంటల వివరాలను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఎల్లుపేట్‌లో పరిశీలన సందర్భంగా మాట్లాడుతూ.. నమోదైన వివరాల ఆధారంగానే ప్రభుత్వ పథకాలు, కొనుగోళ్ళు జరుగుతాయన్నారు. సెప్టెంబర్ 30లోగా ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో DAO దేవకుమార్, తహసీల్దార్ తులసిరామ్ పాల్గొన్నారు.
తెలంగాణ
పంటల నమోదు పక్కాగా చేపట్టాలి: కలెక్టర్


