MBNR: జిల్లాలో మహిళలు, బాలికల భద్రత కోసం షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయని ఎస్పీ డి. జానకి తెలిపారు. ఆగస్టులో 20 ఫిర్యాదులు అందగా 17 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో నిఘా కొనసాగుతోందన్నారు. వేధింపులు ఎదురైతే 8712659365, డయల్-100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
తెలంగాణ
మహిళల భద్రతకు షీ టీమ్స్ నిఘా: SP


