హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

WGL: గ్రేటర్ వరంగల్ 1, 65, 66వ డివిజన్లలో రూ.3.75 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఈ పనులు చేపట్టామని తెలిపారు. దశలవారీగా అన్ని డివిజన్లు, గ్రామాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతాయన్నారు.