హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైక్‌ను ఢీకొన్న టిప్పర్..మహిళకు గాయాలు

TPT: జిల్లాలోని చంద్రగిరి మండలం మండపంపల్లి వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. వెదురుకుప్పం మండలం పాతగుంటకు చెందిన చిన్నమ్మ, కుమారుడు లోకనాధంతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడిపోయారు. అదే సమయంలో టిప్పర్‌ చక్రం కింద పడటంతో చిన్నమ్మ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆమెను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.