అన్నమయ్య: పుల్లంపేట మండలం అనంతసముద్రం సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో రెండు జింకలు మృతి చెందాయి. పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన జింకలను పరిశీలించి, ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. జింకలను ఢీకొన్న వాహనం ఆచూకీ కోసం అధికారులు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
వాహనం ఢీకొని జింకలు మృతి


