హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NTR: జుజ్జూరులో మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రక్తదానం అనేది కేవలం ఒక సేవా కార్యక్రమం మాత్రమే కాదని, ఆపదలో ఉన్న ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడే మహోన్నతమైన కార్యక్రమమని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన, కూటమి శ్రేణులు సేవా కార్యక్రమాలకు పెద్దపీట వేయడం అభినందనీయమన్నారు.