ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వరకు వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ. 2,52,504 ఆదాయం సమకూరిందని, 2,237 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినట్లు ఆలయ EO చందన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
భారీగా పెరిగిన మద్ది ఆదాయం


