హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కూల్‌లో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

TPT: జిల్లాలోని నాయుడుపేట పట్టణంలోని తుమ్మూరు జడ్పీ హైస్కూల్‌ను సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి మధ్యాహ్న భోజనం నాణ్యత, మెనూ, చదువులు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. పిల్లలకు రుచికరమైన, పరిశుభ్రమైన, నాణ్యమైన భోజనం అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.