హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెల్లెళ్లకు అండగా ఉన్న అన్న మృతి

CTR: జిల్లాలోని శాంతిపురం మండలం మాదనపల్లెలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఏడాది క్రితం మద్యానికి బానిసైన భర్త భార్యను హత్య చేయడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. అప్పటి నుంచి తన చెల్లెళ్లకు తల్లిదండ్రిలా అండగా నిలిచిన ప్రకాశ్‌ అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. ఇడుపులపాయ IIITలో చదువుతున్న అతడి మరణంతో చెల్లెళ్లు మరోసారి దిక్కులేనివారయ్యారు.