హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసాపురం ఎమ్మెల్యేను హెచ్చరించిన సీఎం

WG: నర్సాపురంలో ప్రభుత్వ శాఖల పని తీరు ఆశించిన స్థాయిలో లేదని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మొగల్తూరు సభలో ఎమ్మెల్యే నాయకరు ఉద్దేశించి "మీ నియోజకవర్గం పనితీరు బాగోలేదు.. పద్ధతి మార్చుకోవాలి" అంటూ హెచ్చరించారు. 25 శాఖల పనితీరును పరిశీలిస్తే 23 మైనస్లో ఉన్నాయన్నారు. నియోజకవర్గ నోడల్ అధికారి పనితీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.