హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేరాల నియంత్రణకు పటిష్ట నిఘా: ఎస్పీ

సత్యసాయి జిల్లాలో నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ సతీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. పుట్టపర్తి పోలీస్ కార్యాలయం నుంచి మంగళవారం పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో పాత పెండింగ్ కేసులపై చర్చించారు. వినాయక చవితి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిరంతర నిఘా ఉంచాలన్నారు.