హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శాకంబరి అలంకరణలో అభయాంజనేయ స్వామి

KDP: బద్వేల్‌ పట్టణంలోని నెల్లూరు రోడ్డులోని శ్రీ అభయాంజనేయ స్వామి చౌడమ్మతల్లి దేవస్థానంలో శ్రావణమాసం మూడో మంగళవారం సందర్భంగా హనుమంతుడిని వివిధ రకాల కూరగాయలతో శాకంబరి అలంకరణ చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.