హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నల్ల బ్యాడ్జీలతో రెవెన్యూ సిబ్బంది నిరసన

KDP: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిద్ధవటం మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట మంగళవారం రెవెన్యూ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. అమరావతి జేఏసీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తహసీల్దార్ విజయ్‌కుమార్ తెలిపారు. ఉద్యోగుల డీఏ, ఐఆర్, పీఆర్సీ తదితర సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.