E.G: రాజమండ్రి నగరంలోని 39వ డివిజన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళవారం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. నూతనంగా పింఛన్ అందుకున్న కమల తదితర లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డివిజన్లో డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి టీడీపీ ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
పింఛన్ల పంపిణీలో పాల్గొన్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే


