హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్

E.G: పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. మంగళవారం రాజమండ్రి శ్యామలనగర్‌లో క్షేత్రస్థాయి పర్యటన చేసి పారిశుధ్య సేవలు, పార్కుల నిర్వహణను పరిశీలించారు. పార్కుల వద్ద పేరుకుపోయిన చెత్తను హార్టికల్చర్, పబ్లిక్ హెల్త్ సిబ్బంది సమన్వయంతో ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు.