హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీజేపీలో చేరిన ఏబీవీపీ నేత

CTR: పుంగనూరు శాఖ ఏబీవీపీ మాజీ జిల్లా కన్వీనర్ సోమశేఖర్ బీజేపీలో చేరారు. కలికిరిలో మాజీ సీఎం, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు పులి రెడ్డి నరేంద్రకుమార్‌రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. యువతను చైతన్యవంతం చేసి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని సోమశేఖర్ తెలిపారు.