హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొప్పెర్లలో పర్యటించిన ఎమ్మెల్యే

VZM: పూసపాటిరేగ మండలం కొప్పెర్ల గ్రామంలో మంగళవారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ క్రమంలో గ్రామస్తులను ఆత్మీయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.