హైదరాబాద్: 28°C
తెలంగాణ

'క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం'

WGL: క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయని వర్ధన్నపేట MLA కేఆర్‌ నాగరాజు అన్నారు. మామునూరు 4వ బెటాలియన్‌ టీజీఎస్పీలో నిర్వహిస్తున్న ఇంటర్‌ కంపెనీ స్పోర్ట్స్‌ మీట్‌ను మంగళవారం MLA ప్రారంభించారు. పోలీసు సిబ్బంది ఒత్తిడి తగ్గించుకోవడానికి క్రీడలు ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం బెటాలియన్‌ ప్రాంగణంలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు.