CTR: జీడీనెల్లూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రక్రియ 89.19 శాతం పూర్తయిందని డిప్యూటీ ఎంపీడీవో మురుగేషన్ తెలిపారు. మొత్తం 10,584 మంది లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 9,439 మందికి నగదు అందించినట్లు వెల్లడించారు. పెన్షన్ల కోసం మండలానికి ప్రభుత్వం రూ.4.51 కోట్లను కేటాయించినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెన్షన్ల పంపిణీలో జీడీనెల్లూరు ముందంజ


