హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

CTR: గుడిపాల మండలం చీలాపల్లి గ్రామంలో రూ.7 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రం భవనాన్ని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలు, తల్లుల కోసం చేపడుతున్న సామాజిక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.