హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాడపల్లి వెంకన్న ఆలయ షాపులకు టెండర్లు

కోనసీమ: వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాస ప్రాంగణం, కొత్త పార్కింగ్‌లో నిర్మించిన షాపులకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఈవో చక్రధర్‌రావు తెలిపారు. అలాగే దేవస్థాన అవసరాలకు జేసీబీ ఏర్పాటు చేసే హక్కులకు కూడా టెండర్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ప్రథమ ధరావత్తు చెల్లించి ఈ నెల 3వ తేదీ ఉదయం 11 గంటలలోపు టెండర్లు దాఖలు చేయాలన్నారు.