హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు

CTR: వెదురుకుప్పం మండలం బొమ్మలదొడ్ల హరిజనవాడలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్, గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డా. వి.ఎం. థామస్ అధికారులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరవేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.