అన్నమయ్య: రాయచోటి కొత్తపేటలో చెత్త సేకరణకు వెళ్తున్న మున్సిపల్ కార్మికులకు ప్రమాదం పొంచి ఉంది. ఇరుకు వీధుల్లో వేలాడుతున్న విద్యుత్ వైర్లు చెత్త ట్రాక్టర్లకు తగిలే పరిస్థితి నెలకొంది. దీంతో కార్మికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. ప్రమాదం జరగకముందే విద్యుత్, మున్సిపల్ అధికారులు స్పందించి వైర్లను సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాదం అంచున మున్సిపల్ కార్మికులు


